ఉరివేసుకొని డాక్టర్ ఆత్మహత్మ
కరీంనగర్: పట్టణంలోని చల్మెడ వైద్య విద్యాసంస్థలో ఎంఎస్ చదువుతున్న అజయ్ చంద్ర అనే వైద్యుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం .జిల్లా వైరాకు చెందిన ఈయన ఎంఎస్ చదువుతున్నాడు. మూడు నెలల క్రితం వావిలాలపల్లి ఇల్లు తీసుకోని భార్యతో కాపురం పెట్టారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు అసెంబ్లీ ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క సోదరుని కుమారుడు.