ఉరేసుకుని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి అత్మహత్య
న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి ఒకతను అత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. 21 ఏళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థి తన హస్టల్ గదిలో ఉరేసుకుని శుక్రవారం మరణించాడు. అతన్ని బీహర్‌లోని నలంద జిల్లాకు చెందిన శశిశేఖర్‌గా గుర్తించారు. విశ్వవిద్యాలయం అవరణలోని హిందూ కాలేజి హస్టల్‌లోని 112వ నెంబర్ గదిలో అతను ఒక్కడే ఉంటున్నాడు అతను ఉరేసుకుని ఉండడాన్ని హస్టల్‌లోని విద్యార్థులు శుక్రవారం ఉదయం తోమ్మిదిన్నర గంటల ప్రాంతంలోచూశారు. వారు అ విషయాన్ని హస్టల్ వార్డెన్‌కు తెలియజేవారు. శివ శేఖర్ మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉత్తర ఢిల్లీలోని హిందూ రావు అస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. శివశేఖర్ గది నుంచి పోలీసులు క్లాస్ లెక్చర్ సోటిసు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లోని ఓ పేజీలో ఇది నా జీవితం అని రాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో విధ్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.