ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర

నాగార్జున ఆగ్రో కెమికల్‌ కంపనీలో ,
పేలిన రియాక్టర్‌ ,
భారీ అగ్నిప్రమాదం ,
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ,
పరుగులు తీసిన పల్లెలు ,
శ్రీకాకుళం, జూన్‌30: శ్రీకాకుళం జిల్లాలోని నాగార్జుజన అగ్రికెమ్‌ పరిశ్రమలలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం పరిశ్రమలోని ఐదో బ్లాక్‌లో మొదలైన మంటలు మూడు, నాలుగు బ్లాక్‌లకు విస్తరించాయి. మంటలు దాటికి రెండు రియాక్టర్లు పేలిపోయాయి. అయితే, ఎవరైనా చనిపోయా? ఎంత మంది గాయపడ్డారనే దానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 17మంది గాయపడ్డారని, వారిని అసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్ల పేలుడుతో విషవాయువులు వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మరిన్ని రియాక్టర్లు పేలిపోయే ప్రమాదం ఉండడంతో పరిసర గ్రామాలను ఖాళీ చేయించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని జంక్షన్‌లో ఉన్న నాగార్జున అగ్రీ కెమికల్స్‌ ఫార్మా విస్తరించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడి దట్టమైన పొగ వ్యాపించింది. ఐదో బ్లాక్‌లో ప్రమాదం జరగగా, మరో రెండు బ్లాక్‌లకు కూడా విస్తరించాయి. ప్రమాద సమయంలో ఐదో బ్లాక్‌లో దాదాపు 2వందల మంది భయాందోళనతో పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న కార్మికుల సహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగింది. సుమారు 40మంది కార్మికులు గాయపడినట్లు సమాచారం. మరోవైపు మంటలు దాటికి ఐదో బ్లాక్‌లోని రియాక్టర్‌ పేలిపోయింది. దీంతో దట్టమైన పోగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. పొగ కారణంగా ఎచ్చెర్ల జాతీయ రహదారిపై ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరిన్ని రియాక్టర్లు పేలుతాయోనని అధికారులు రాకపోకలను నిషేదించారు. పరిశ్రమ వైపు ఎవరినీ అనుమతించలేదు.
రగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. నాలుగు గంటలుగా శ్రమించినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో శ్రీకాకుళంతో పాటు విజయనగరం జిల్లా నుంచి కూడా మరిన్ని ఫైరింజన్లను రప్పించారు.