ఊపందుకున్న ఖరీప్‌ పనులు- నిమగ్నమైన రైతులు

చందుర్తి, జూన్‌ 16 (జనంసాక్షి) : ఖరీప్‌ సీజన్‌ ఆస్సన్నం కాగా పనులు ఊపందుకున్నాయి. తొల కరి వర్షాలతో పలకరించగా రైతులు నిమగ్న మయ్యారు. విత్తనాల సేకరణలో రైతులు దుకా ణాలను ఆశ్రయిస్తున్నారు. వేసవి దుక్కులను దున్ను కున్న రైతులు విత్తనాలను వత్తేందుకు సిద్దం చేస్తున్నారు. పత్తి మోళ్లు తొలగించి ట్రాక ్టర్లతో దున్నుతున్నారు.సాగుకు రైతులు సమా యత్తం చేస్తున్నారు. విత్తనాలు విత్తేందుకు మోతాదుగా వర్షం కురిసిగా రైతులు బీజీబీజీలో ఉన్నారు. ఖరీప్‌ సీజన్‌లో రైతులు ఎంచుకున్న పంటల సాగుకు కృఫి చేస్తున్నారు. కార్తెలో విత్తనాలు రైతులు విత్తేందుకు ట్రాక్టర్లతో రేయిం భవళ్లు దున్నుకుంటున్నారు. పంటల సాగుకు విత్తనాలు కూలీలతో విత్తేందుకు రైతులు ప్రద క్షణలు చేస్తున్నారు. చందుర్తి మండల కేంద్రంతోపాటు రుద్రంగి, సనుగుల, బండపల్లి, నర్సింగాపూర్‌, మూడపల్లి, మర్రిగడ్డ తదితర గ్రామాల్లో పంటల సాగుకు రైతులు నిమగ్న మయ్యారు.