ఎంపీ పొన్నంను విమర్శించే నైతిక హక్కు లేదు
కరీంనగర్ టౌన్, జూలై 16 (జనంసాక్షి) : ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను విమర్శించే నైతిక హక్కు వైఎస్సార్‌సీపీ నాయకులు పుట్ట మధు, కేకే, ఆది శ్రీనివాస్‌కు లేదని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ మొహసిన్ అహ్మద్‌ఖాన్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయమ్మకు చేనేతల సమస్యల గురించి ఏమి తెలుసని మండిపడ్డారు. కాగా, తన కొడుకు జగన్మోహన్‌రెడ్డి ప్రజల సొమ్ము లూఠీ చేసి, ప్రస్తుతం జైల్లో ఉన్నాడని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడుగా సిరిసిల్ల పట్టణాన్ని సందర్శించాడా, అక్కడున్న సమస్యలు ఆయనకు ఏమైనా తెలుసా అని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్నాడన్నారు. ఇప్పటికైనా వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ షకీల్, బాబూమియా, జాఫర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.