ఎం రాములు ఆశయాన్ని కొనసాగిస్తాం సిపిఎం పార్టీ. వివిధ పార్టీల పలువురు నేతలు నివాళులర్పించారు.
కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 01 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలో జిల్లా కమిటీ సభ్యులు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం శ్రీనివాసులు తండ్రి ఎం రాములు అకాల మరణం చెందడం జరిగింది గురువారం రోజు కోడేరు మండల కేంద్రంలో కామ్రేడ్ రాములు అంతక్రియలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు పాల్గొని మాట్లాడుతూ రాములు మరణం సిపిఎం పార్టీకి శ్రీనివాసులు కుటుంబానికి తీరని లోటు అని రాములు తోడ్పాటు తోనే మన కుమారుడు సిపిఎం జిల్లా నాయకునిగా పూర్తి కాలం కార్యకర్తగా కొనసాగుతున్నాడు అంటే ఆయన ప్రోత్సాహం సహాయ సహకారాలు మనం గుర్తుంచుకోవాలని వారు అన్నారు. రాములు పేద ప్రజల కష్టాలు తొలగాలని సమ సమాజం నిర్మాణం జరగాలని కలలు కన్నాడని వారు గుర్తు చేశారు అంత్యక్రియల్లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శివవర్మ శంకర్ నాయక్ తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సి బాల్రెడ్డి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం తారా సింగ్ జిల్లా ఉపాధ్యక్షులు కురుమయ్య తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం రమేష్ ఉపాధ్యక్షులు బి బాల పేరు తెలంగాణ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కన్వీనర్ బి చంద్రమౌళి ఆవాజ్ జిల్లా నాయకులు ఎండి రషీద్ సిపిఎం మండల కమిటీ సభ్యులు మాలిక్ ఈశ్వర్ వి రవి మండల కార్యదర్శి పి నరసింహ వనపర్తి జిల్లా తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు కోదండరాములు కోడేరు మండలంలోని సిపిఎం పార్టీ సభ్యులు సానుభూతిపరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.