ఎక్సైజ్‌ ఏసీకి పదోన్నతి

శ్రీకాకుళం, ఆగస్టు 2 : ఎక్సైజ్‌ శాఖ సహాయ కమిషనర్‌గా ఉన్న సత్యనారాయణకు ఉప కమిషనర్‌గా పదోన్నతి లభించింది. విశాఖకు ఆయనను పదోన్నతిపై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళానికి ఇంకా అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఎవరినీ నియమించలేదు.