ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఆధ్వర్యంలో
సాయమ్మ చెరువు గట్టుపై హారతి హారం మొక్కలు
టేకులపల్లి, ఆగస్టు 21( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి పరిధిలోగల సాయమ్మ చెరువు గట్టుపై ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఆధ్వర్యంలో హరితహారం లో భాగంగా ఆదివారం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈ ఎస్) జానయ్య కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు.తాటి ,ఈత ,ఖర్జూర మొక్కలు నాటిన ఎక్సైజ్ సిబ్బంది.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ రాజశేఖర్, ఎస్సై సమీ ఉల్లా ఖాన్, హెడ్ కానిస్టేబుల్ రవిబాబు , కానిస్టేబుల్స్ తులసి, చారి , స్థానిక సర్పంచ్ లావుడియా శంకర్ నాయక్, ఎంపీటీసీ సభ్యులు మాలోతు ధనలక్ష్మి, గ్రామ కార్యదర్శి సిద్ధాంతి చిట్టి, ఇల్లందు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులు బుర్ర ధర్మయ్య గౌడ్ ,బొమ్మనపల్లి కల్లుగీత సొసైటీ ప్రెసిడెంట్ బుర్ర మోహన్ రావు గౌడ్ ,గీత కార్మికులు యాసారపు నరసయ్య గౌడ్, నల్లమాసు శంకర్ గౌడ్ ,యాసారపు రాజేందర్ గౌడ్ , మొగలగాని రాజు గౌడ్ ,వల్లాల రవికుమార్ గౌడ్ ,యాసారపు లింగయ్య గౌడ్ ,సారకల్ల గౌడ్ , పెద్దగోని రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.