ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి -జిల్లా ఎస్పీ రితిరాజ్

గద్వాల నడిగడ్డ, నవంబర్ 29 జనం సాక్షి.
నేడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆలంపూర్ నియోజకవర్గo కు సంబందించి ఆలంపూర్ చౌరస్తా లోని మార్కెట్ యార్డ్ లో, గద్వాల నియోజకవర్గం కు సంభందించి గద్వాల టౌన్ లోని బేరెల్లి రోడ్ లో ఉన్న ప్రియ దర్శిని మహిళ డిగ్రీ కళాశాల లో ఎన్నికల పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా జోగులాంబ గద్వాల ఎస్పీ రితిరాజ్ అవగాహన కార్యక్రమం ను నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుతంగా నిర్వహించుటకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఎన్నికల సిబ్బందికి మరియు కేంద్ర, యు పి, కర్నాటక పోలీస్ సిబ్బంది వారితో సమన్వయంతో జిల్లా పోలీస్ సిబ్బంది పనిచేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఉండేలా సంబంధిత అధికారులతో మాట్లాడి సరిచూసుకోవాలని, పోలింగ్ కేంద్రాల విధుల్లో ఉండే సిబ్బంది ఏదైనా సమస్య వస్తే వెంటనే రూట్ మొబైల్ టీమ్ కు సమచారం అందించాలని వారు వెంటనే లోకల్ ఎస్సై సమచారం అందిస్తే యు ఆర్ టి టీమ్ ను పంపించడం జరుగుతుందని తెలిపారు . ప్రతి రూట్ మొబైల్ టీమ్ తమ రూట్ లో ఎన్ని పోలింగ్ కేంద్రాలు, ఎన్ని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, ఎన్ని గ్రామాలు ఉన్నాయో పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోలింగ్ కేంద్రం విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రతి 5గురిని ఒక్కో సారి తనిఖీ చేసి లోపలికి పంపాలని సూచించారు.
ఓటర్లు క్యూలైన్లు పాటించే విధంగా,ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే వారు, ప్రధానంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గల గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని,పలు జాగ్రత్తలు సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై నిఘా పెట్టాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని , ఎవరైనా ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే తక్షణమే సంబంధిత పై అధికారులకు తెలపాలని అన్నారు. ఓటర్లకు భరోసా కలిగించే విధంగా ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి, డి. ఎస్పీ వేంకటేశ్వర్లు, సాయుధ దళ డి. ఎస్పీ ఇమ్మనీయోల్ , ఆలంపూర్, గద్వాల, శాంతి నగర్ సి. ఐ లు, ఎస్సై లు , సి ఏ పి ఎఫ్, యు పి, కర్నాటక , జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.