ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని 5 జిల్లాలకు కరెంట్ కోత
వరంగల్: ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాలకు కరెంట్ కోత విధించనున్నట్లు సీఎండీ నర్సింహారెడ్డి ప్రకటించారు. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు రోజుకు 5 గంటలు, వరంగల్ జిల్లాకు రోజుకు 30 గంటలు విద్యుత& కోత విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐదు జిల్లాలోని పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో రోజుకు 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలు కోత విధిస్తున్నట్లు చెప్పారు. పెద్ద పరిశ్రమలకు 3 రోజులు, చిన్న పరిశ్రమలకు 2 రోజులు పవర్ హాలిగే ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయం, సింగరేణి, ప్రభుత్వ ఆస్పత్రులు, తాగునీరు, రైల్వేలు, రక్షణ సంస్థలకు విద్యుత్ కోత నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు.