ఎన్‌హెచ్‌ఆర్‌సీ సెక్రటరీ జనరల్‌గా ఏకే జైన్
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నూతన సెక్రటరీ జనరల్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్ జైన్ నియమితులయ్యారు. 1977 బ్యాచ్ నాగాలాండ్ కేడర్‌కు చెందిన ఏకే జైన్ ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖలోని అంతర్ రాష్ట్రాల మండలి సచివాలయానికి సలహాదారుగా పనిచేస్తున్నారు.



