ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌ ఆమోదాన్ని స్వాగతించిన అమెరికా

వాషింగ్టస్‌: మల్లీబ్రాండ్‌లో ఎఫ్‌డీఐలకు అనుమతి ఇస్తూ భారత పార్లమెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి మార్క్‌ టోనర్‌ వెల్లడించారు. చిన్న వ్యాపారాల్లో ఎఫ్‌డీఐలు ఉపాధి అవకాశాలు పెంచుతాయని, వినియోగదారులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఎఫ్‌డీఐలతో భారత మార్కెట్లు అభివృద్ధి చెందుతాయని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

తాజావార్తలు