ఎఫ్‌డీఐ ఓటింగ్‌పై టీడీపీలో ముదురుతున్న వివాదం
హైదరాబాద్: రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్ వివాదంపై టీడీపీ డ్యామ్‌జ్ కంట్రోలింగ్ డ్రామా ప్రారంభించింది. రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్‌కు టీడీపీ ఎంపీలు హాజరు కాకపోవడం చంద్రబాబుకు తెలిసే జరిగిందనే విషయం బయట పడటంతో కొంత మంది టీడీపీ నేతలు తమ అధినేత పరువును పాకాడే ప్రయత్నంలో పడ్డారు. ఇందులో భాగంగానే ఓటింగ్‌లో పాల్గొనని ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీలు దేవేందర్‌గౌడ్, సుజనా చౌదరి, గుండు సుధారాణిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే కొత్త కోట దయాకర్‌రెడ్డి అధినేత చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభలో ఎంపీలు చేసిన పని క్షమించరాని నేరమని,పైగా చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభలో ఎంపీలు చేసిన పని క్షమించరాని నేరమని, పైగా చంద్రబాబుకు చెప్పే చేశామని ఆనటం ఆత్మహత్యా సదృశమన్నారు. ఆ ముగ్గురు ఎంపీలకు చీము నెత్తురు ఉంటే వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా-చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని కాపాడటానికి చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని వైసీపీ, టీఆర్‌ఎస్, బీజేపీలు ధ్వజమోత్తాయి. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు ఎంత ముట్టిందో వెల్లడించాలని, వారం రోజులకు సంబంధించి చంద్రబాబు కాల్‌లిస్టును అధికారులు విడుదల చేయాలని టీడీపీ నుంచి వెళ్లిపోయి వైసీపీలో చేరిన తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి అన్నారు.
మరో పక్క.. ఇదంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి కాంగ్రెస్, టీడీపీలు కుట్రలో భాగమేనని టీఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణవాదులు మంది పడుతున్నారు. తెలంగాణ ఏర్పాటు చేయకుండా ఉంటే ఏ విషయంలోనైనా టీడీపీ సహాయం కాంగ్రెస్‌కు ఉంటుందని చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపిస్తున్నారు.