ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శలు
జనంసాక్షి, రామగిరి, అక్టోబర్ 07 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల, ముస్త్యాల గ్రామాల్లో పలు కుటుంబాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న నడిపెల్లి రాజేశ్వరరావు, ఊట్ల గోపాల్ రెడ్డి భార్యను, కొమురనేని శ్రీనివాసరావు, మార్క స్వామి తల్లి ని శ్రీధర్ బాబు పరామర్శించారు. అలాగే పలు బాధిత కుటుంబాలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ నాయకులు జనగామ బుచ్చిబాబు, తోట చంద్రయ్య, మహేష్ రావు, వైనాల రాజు, తీగల సమ్మయ్య ముత్యాల శీను, కాటం సత్యం, సుందిళ్ల కృష్ణ, ముస్కుల నరేందర్ రెడ్డి, సురేష్, రక్షిత్ తదితరులు ఉన్నారు.