ఎరువుల అక్రమ మళ్లింపును అపాలని రాష్ట్రాలను అదేశించిన కేంద్రం

న్యూఢిల్లి: రాయితీల దుర్వినియోగం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఎరువుల అక్రమ మళ్లింపును అడ్డుకొనేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను అదేశించింది. ప్రత్యేకించి గుజరాత్‌, మహరాష్ట్ర, హర్యానాల్లో యురియా వంటి ‘ఎరువులు దారి మళ్లుతున్న ఘటనలు వెలుగులొకి రావడంతో ఈ చర్యలు చేపట్టింది. ఎరువులు ఇతర పరిశ్రమలకు అక్రమంగా తరులుతున్నట్లు మా దృష్టికి వచ్చింది.  కేంద్ర,రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థల సాయంతో ఎరువుల అక్రమ మళ్లింపునకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని  రాష్ట్రాల ప్రదాన కార్యదర్శులకు లేఖలు రాశాం’ అని మంత్రిత్వ శాఖ సీనియర్‌ అదికారి తెలిపారు. ఏటా 20 లక్షల టన్నుల ఎరువులు .. ప్రత్యేకించి  యురియా అక్రమంగా ప్లైవుడ్‌, వస్త్ర, ఇతర పరిశ్రమలకు  తరలిస్తున్నట్లు అంచానా గుజరాత్‌, మహరాష్ట్ర, హర్యానాల నుంచి ఇలాంటి పిర్యాదులు ఎక్కువగా అందాయి.ఎరువులపై ఇస్తున్న రాయితీ దుర్వినియోగం అవుతున్నందున్న ఈ అక్రమ తరలింపుపై కఠిన చర్యలు తఅసుకోవాలనిరాష్ట్రాలను అదేశించమని అదికారి అన్నారు.