ఎస్పీ, ఎస్టీలకు ప్యాకేజీ అమలుకు సీఎం ఆమోదం

హైదరాబాద్‌:  రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల అమలుపై  మంత్రివర్గ ఉపసంఘంతో సమీక్షించారు. ఎస్సీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.2900 కోట్లు  ఎస్టీల అభివృద్ధి, మౌలిక  వసతుల కల్పనకు రూ.1500 కోట్ల ప్యాకేజీని అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సచివాలయంలో ఈరోజు ఆయన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల అమలుపై మంత్రివర్గ ఉపసంఘంతో సమీక్షించారు. ఇందులో భాగంగా ఎస్సీ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలకు మౌలిక వసతుల కల్పన, ప్రత్యేక ఉపకార వేతనాలు అమలు చేయనున్నారు. డిగ్రీ, పీజీ, ఇతర ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.