ఎస్పీ కిడ్నాప్ వ్యవహారంపై విచారణకు ఆదేశం
హైదరాబాద్: పోలీసు ట్రాన్స్‌పోర్టు ఎస్పీ లక్ష్మీనారాయణ కిడ్నాప్ వ్యవహారంపై డీజీపీ దినేశ్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా ఏఐజీ సుబ్బారావుని నియమించారు. పోలీసు ట్రాన్స్‌పోర్టు విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ సస్పెండైన శర్మ నిన్న ఎస్పీ లక్ష్మీనారాయణను కొన్ని గంటల పాటు నిర్భంధించి, ఆయనను విడిచి పెట్టడానికి పలు షరతలు పెట్టడమే కాకపై అధికారులపై ఆరోపణలు చేసిన విషయం విదితమే.



