ఎస్‌బిఐ వందేళ్ళ తపాలా కవరు ఆవిష్కరణ

విజయనగరం, జూన్‌ 28 : దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉందని విశాఖ రీజియన్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ చంద్రప్రకాష్‌ అన్నారు. భారతీయ స్టేట్‌బ్యాంకు విజయనగరం శాఖ వందేళ్ళ సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను ఇక్కడి బ్యాంకు మెయిన్‌ బ్రాంచ్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తపాలా శాఖ ద్వారా ఇటువంటి కవరు ఆవిష్కరణ గౌరవప్రధమని అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్‌ రంగంలో ఎస్‌బిఐ అగ్రగామి అని ఇటీవల 27వేల సబ్‌ పోస్టాఫీసులను కంప్యూటరీకరించామని వచ్చే ఏడాదిలోగా వీటి సరసున 1.25 లక్షల పోస్టు ఆఫీసులు చేరుతాయని చెప్పారు. సమావేశంలో బ్యాంకు డెప్యూటీ జనరల్‌ మేనేజర్‌ దుర్గా ప్రసాద్‌, జనరల్‌ మేనేజర్‌ కృష్ణస్వామి, ప్రాంతీయ మేనేజర్‌ జగన్‌మోహనరావు, డెప్యూటీ జనరల్‌ సెక్రటరీ ప్రభాకర్‌, చీఫ్‌ మేనేజర్‌ దత్తాత్రేయ తదితరులు ప్రసంగించారు. ఉద్యోగ సంఘ ప్రతినిధులు సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.