ఎస్ ఐ సురేష్ ను సన్మానించిన యువ నాయకులు రవికుమార్

జహీరాబాద్ సెప్టెంబర్ 23 ( జనంసాక్షి) జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహిర్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ గా సురేష్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా యువ నాయకులు రవికుమార్ ఆధ్వర్యంలో శాలువ పూలమాల తో ఘనంగా సన్మానించారు.శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయనకు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎస్ ఐ గా బాధ్యత లు చేపట్టిన సందర్భంగా సన్మానించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పద్మారావు నాయకులుసంజీవ్,చిన్న,,మోహన్,ప్రవీణ్,ఏలియా మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.