‘ఏఐటీయూసీపైనే కార్మికులకు నమ్మకం’

– ఏఐటీయూసీ నేత గట్టయ్య
గోదావరిఖని, జూన్‌ 8 (జనంసాక్షి) : ఏఐటీయూసీ చెప్పిందే చేస్తుందని కార్మికులకు పూర్తి నమ్మకం ఉందని సంఘ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.గట్టయ్య అన్నారు. శుక్రవారం స్థానిక 1వ బొగ్గుగని జరిగిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ… తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని నేరవేర్చామని, దీపావళి బోనస్‌ రూ.21వేలు పెరిగేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సాధించామన్నారు. పదవీ విరమణ పొందిన కార్మికులకు 40శాతం పెన్షన్‌, ఆదాయపు పన్ను రద్దుకై పోరాడుతున్నామన్నారు. ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, టీబీజీకేఎస్‌లు లబ్ధిపొందడానికి కార్మికులకు తమపై అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ సంఘాలు ఎన్ని చెప్పినప్పటికి కార్మికులు నమ్మరని, గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీనే గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు దయాకర్‌రెడ్డి, కనకయ్య, మడ్డి ఎల్లయ్య, చేరాలు, తిరుపతి, ఐలుమల్లు తదితరులు పాల్గొన్నారు.
సమ్మె అడ్వాన్స్‌ రద్దుకై వినతి…
సకలజనుల సమ్మె కాలంలో సింగరేణి యాజమాన్యం కార్మికులకు ఇచ్చిన రూ.25వేలు అడ్వాన్స్‌ రద్దుకై శుక్రవారం ఆర్జీ-1 పరిధిలోని అన్ని గనులపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో యాజమాన్యానికి వినతి పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లయ్య, గడ్డం రాజయ్య, జగదీశ్వర్‌, సిర్ర మైసయ్య, బాపురెడ్డి, గంగాధర్‌, రాజలింగయ్య, శేషారెడ్డి, అహ్మద్‌, ఎస్‌.గంగాధర్‌, రఘు, షబ్బీర్‌అ హ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.