ఏకగ్రీవంగా ఎన్నికైన విడిసి చైర్మన్ కు ఘనసన్మానం.
నేరడిగొండసెప్టెంబర్11(జనంసాక్ షి):మండలంలోని కుమారి గ్రామంలో ఆదివారం రోజున గ్రామ ప్రజల సమక్షంలో నూతన గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ బి.బిమార శంకర్ ను వైస్ చైర్మన్ కటికెన పిల్లి సాయన్న కార్యదర్శి రాజేంద్రప్రసాద్ క్యాసియర్ రమణ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ముదిరాజ్ కులానికి చెందిన బిమార శంకర్ కు విడిసి చైర్మన్ పదవి దక్కినందుకు కుమారి గ్రామ పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్ తోపాటు ముదిరాజ్ కుల సంఘం కమిటీ సభ్యులు వారికి శాలువతో సత్కరించి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బాధ్యత అప్పగించినందుకు గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో కుమారి గ్రామ పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్ ముదిరాజ్ కుల సంఘం నాయకులు గ్రామ అభివృద్ధి కమిటీ వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.