ఏకీకరణ సాధించడంలో కోదండరాం విఫలం

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ కోదండరాం నాయకత్వం వహిస్తున్న తెలంగాణ రాజకీయ ఐకాస వ్యతిరేకంగా సామాజిక తెలంగాణ జేఏసీ ఆవిర్భవించింది. ఓయూ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన ఆవిర్భావ సదసుసలో బీసీ ఉద్యమ నేత వీజీఆర్‌ నారగోని ఛైర్మన్‌గా, ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. కోదండరాం నాయకత్వంలోని జేఏసీ అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని దావడంలో పూర్తిగా విఫలమైందని జేఏసీ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలిసి వచ్చే వారితో ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేసి ప్రజలను కదిలించడానికి తమ జేఏసీ పనిచేస్తుందన్నారు.