ఏజెన్సీ ప్రాంతానికి ఏడు బిఎస్ఎన్ఎల్ టవర్స్
కొత్తగూడ సెప్టెంబర్ 27జనంసాక్షి:కొత్తగూడ మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ చందా నరేష్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రజలు టెలికాం సిగ్నల్ సమస్యలతో బాధపడుతూ ఉండడాన్ని గమనించి ఏజెన్సీ ప్రాంత ప్రజల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ శశాంక మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంత ప్రజలందరికీ 4జి సేవలు అందాలని మండలంలోని గుండం,బత్తులపల్లి,తాటివారి వేంపల్లి,ఈశ్వర గూడెం,దొరవారి వేంపల్లి,కర్ణగండి,బోతవాని గూడెం గ్రామాలకు టవర్స్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.బిఎస్ఎన్ఎల్ 4జీ టవర్స్ కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు.