ఏడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న నాదల్‌

రోలాండ్‌ గారోస్‌-

ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను స్పెయిన్‌ ఆటగాడు, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రఫెల్‌ నాదల్‌ కైవవసం చేసుకున్నాడు. నాదల్‌ టైటిల్‌ గెల్చుకోవడం దీనితో ఏడోసారి. సోమవారం జరిగిన ఫైనల్‌ పోరులో జకోవిచ్‌పై నాదల్‌ 6-4, 6-3, 2-6, 7-5 తేడాతో విజయం సాధించాడు. రోలాండ్‌ గారోస్‌లో ఏడో టైటిల్‌ సాధించి అత్యధిక సార్లు రోలాండ్‌ గారోస్‌ టైటిల్‌ దక్కించుకున్న తొలి ఆటగాడిగా నాదల్‌ రికార్డు సృష్టించాడు.