మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు
` 24 లేదా 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?
` కలెక్టర్లతో ఎసఈసీ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్(జనంసాక్షి):మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్లతో ఎసఈసీ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించనున్నారు. గురువారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లతో, ఈనెల 23న రంగారెడ్డి, మేడ్చల్, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లతో ఎసఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై చర్చించనున్నారు. ఈనెల 24న లేదా 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



