గ్రీన్‌లాండ్ స్వాధీనం చేసుకుని తీరతాం
` ఆ ప్రాంతానికి చాగోస్ దీవుల పరిస్థితి రాకూడదు
` మరో కారణం చెప్పిన ట్రంప్
వాషింగ్టన్(జనంసాక్షి):గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కారణాలు చెబుతున్నారు. తాజాగా చాగోస్ దీవుల ప్రస్తావన తీసుకొచ్చారు. వాటిలా తాము గ్రీన్‌లాండ్‌ను వదులుకోలేమని వెల్లడించారు. “తెలివైన నాటో మిత్రదేశం యునైటెడ్ కింగ్డమ్.. అమెరికాకు చెందిన కీలక సైనిక స్థావరం ఉన్న డియేగోగార్సియాను మారిషస్‌కు ఇచ్చేయాలని యోచిస్తోంది. ఇది తెలివితక్కువ పని. ఈ నిర్ణయం వల్లే గ్రీన్‌లాండ్ విషయంలో నేను కఠినంగా వ్యవహరిస్తున్నాను” అని ట్రంప్ పోస్టు చేశారు. చాగోస్ దీవులను మారిషస్‌కు అప్పగించాలన్న బ్రిటన్ విధానాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే తమ రక్షణ దష్ట్యా గ్రీన్‌లాండ్ అంశంలో అమెరికా అలాంటి నిర్ణయాలు తీసుకోబోదని ఈ పోస్ట్‌తో స్పష్టం చేసినటె్టౖంది.హిందూ మహాసముద్రంలో 60 దీవుల సముదాయం చాగోస్ ఇవి ఒకప్పుడు బ్రిటిషు పాలనలో మారిషస్‌కు అనుబంధంగా ఉండేవి. 1965లో మారిషస్ నుంచి ఈ దీవులను బ్రిటన్ 3మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది. వాటిని చట్టవిరుద్ధంగా ఇతరులకు (అమెరికాకు) ఇచ్చేశారని మారిషస్ వాదిస్తూ వచ్చింది. దీనిపై గతేడాది యూకే, మారిషస్ ఒప్పందానికి వచ్చాయి. దాని ప్రకారం.. ఈ ద్వీప సమూహాన్ని మారిషస్‌కు తిరిగి అప్పగించి, ఆ దీవుల్లో అతిపెద్దదైన డియేగోగార్సియాను యూకే లీజుకు తీసుకోనుంది. 99 సంవత్సరాల పాటు లీజు కొనసాగనుంది. ఇందుకోసం ప్రతి ఏడాదికి 101 మిలియన్ పౌండ్లు (రూ.1237 కోట్ల మేర) చెల్లించనుంది. అక్కడ బ్రిటిష్` అమెరికన్ సంయుక్త సైనిక, వైమానిక స్థావరం ఉంది. ఈ ఒప్పందాన్ని గతంలో ట్రంప్ స్వాగతించారు.కానీ ఇప్పుడు విరుద్ధమైన వైఖరిని ట్రంప్ ప్రదర్శించడం గమనార్హం. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా విస్తరణను అడ్డుకునేందుకే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని ప్రకటిస్తున్నారు. చాగోస్ దీవుల విషయంలో ఇదే లాజిక్ వాడుతున్నారు. ఈ క్రమంలో యూకేను విమర్శిస్తూ..“ఈ బలహీన చర్యను రష్యా, చైనా గమనిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అవి బలాన్ని మాత్రమే గుర్తిస్తాయి. అందుకే నా నాయకత్వంలో అమెరికాకు ఎన్నడూ లేని గౌరవం లభిస్తోంది. అందుకే డెన్మార్క్, దాని ఐరోపా మిత్ర దేశాలు సరైన నిర్ణయం తీసుకోవాలి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంటే గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు అప్పగించాలని పరోక్షంగా సూచించారు.
యూఎస్ మ్యాప్‌ను మార్చి..
కెనడా, వెనెజువెలా, గ్రీన్‌లాండ్ భాగంగా ఉన్న యూఎస్ మ్యాప్‌ను ట్రంప్ సోషల్ విÖడియా వేదికగా షేర్ చేశారు. ఆ చిత్రంలో ట్రంప్‌తో పాటు ఐరోపా దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఉన్నారు. గ్రీన్‌లాండ్ విషయంలో ఐరోపా దేశాలతో విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ పోస్టు చేశారు.



