ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌కి తెలంగాణే వేదిక
` ఏఐతో సమర్ధవంతంగా పౌరసేవలు
` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం
` జ్యూరిక్‌లో ముఖ్యమంత్రికి ప్రవాసుల ఘనస్వాగతం
దావోస్(జనంసాక్షి):దావోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక ఆధ్వర్యంలో దావోస్‌లో నిర్వహించిన ‘ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రా స్టక్చర్ ఫర్ బిల్డింగ్ కంపెటిటివ్ నెస’ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా వంటి సబ్సిడీల ట్రాకింగ్ నుంచి మొదలుకుని ఆస్తి పన్ను వసూళ్లు, మహిళలకు అందించే సంక్షేమ పథకాల అమలు, పట్టణ మున్సిపల్ సమస్యల పరిష్కారం వరకు అనేక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. వ్యవస్థలోని మేధస్సే ఒకవైపు సమస్యగా, మరోవైపు పరిష్కారంగా మారుతోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏఐని సరైన దిశలో వినియోగిస్తే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని అన్నారు. అదునాతన ఏఐ యుగంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండలేవని, ముందస్తు చర్యలు తీసుకోవడం, వేగంగా నిర్ణయాలు అమలు చేయడమే కీలకమని ఏఐ ప్రభావం గురించి మాట్లాడారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ముఖ్యమంత్రి వివరిస్తూ.. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.ప్రస్తుతం హైదరాబాద్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారిందని, అన్ని రంగాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉండాలంటే మేధోవంతమైన వ్యవస్థలను నిర్మించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఈ సదస్సులో స్మార్ట్ ఫ్యాక్టరీలు, స్థిరమైన ఇంధన వ్యవస్థలు, ఏఐ ఆధారిత సేవలు, స్మార్ట్ సిటీల నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలపై చర్చించారు.ఈ సమావేశంలో ఈజిప్ట్ పెట్టుబడులు, విదేశీ వాణిజ్య మంత్రి హస్సన్ ఎల్కహతీబ్, ఎమరాల్డ్ ఏఐ సీఈఓ వరుణ్ శివరామ్, ప్రపంచ మేధోసంపత్తి సంస్థ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, జర్మనీ డిజిటల్ మంత్రిత్వ శాఖ మంత్రి కార్ స్టెన్ వైల్డ్ బెర్గర్, నోకియా సీఈఓ జస్టిన్ హోటార్డ్, హిటాచి సీఈఓ తోషియాకి టోకునాగా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
జ్యూరిక్ చేరుకున్న రేవంత్‌కు ప్రవాసుల ఘనస్వాగతం
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో సీఎంకు ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు. జ్యూరిక్ నుంచి రేవంత్ బందం దావోస్‌కు వెళ్లనుంది. అక్కడ నాలుగురోజుల పాటు సమావేశాల్లో పాల్గొననుంది. వివిధ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. ’తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్ మ్యాప్‌తో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను రేవంత్ వారికి వివరించనున్నారు. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు`2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బందం.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం ప్రతినిధి బందానికి జ్యూరిక్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. దావోస్ సదస్సులో మొదటి రోజు వివిధ రంగాలకు చెందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశంల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. తెలంగాణ రైజింగ్`2047 రోడ్ మ్యాప్‌ను ఈ ఆర్థిక సదస్సులో పారిశ్రామికవేత్తలకు ఈ సీఎం ప్రతినిధి బందం వివరించనుంది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అభివద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకున్న అనుకూలతలను వారికి వివరించడంపై సీఎం రేవంత్ ప్రతినిధి బందం ఇప్పటికే దష్టి సారించింది. గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్`2047 విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన అభివద్ధి నమూనాకు అనుగుణంగా సుస్థిర పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దష్టి కేంద్రీకరించింది. దావోస్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు సీఎం రేవంత్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ చేరుకున్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం ములుగు జిల్లాలోని మేడారానికి చేరుకున్నారు. అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించారు. స్థానికంగా చేపట్టిన పలు అభివద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. సోమవారం ఉదయం సమ్మక్క, సారలమ్మలను సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని.. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు ప్రతినిధుల బందం బయలుదేరి వెళ్లింది.
దావోస్‌లో ట్రంప్ విందు.. ఏడుగురు భారతీయ సీఈవోలకు ఆహ్వానం!
స్విట్జర్లాండ్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు దావోస్ చేరుకుంటున్నారు. ఇందులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరేళ్ల తర్వాత వస్తుండగా.. ఇందులో ఆయన పాల్గొనడం మూడోసారి. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసే విందుకు ఏడుగురు భారతీయ సీఈవోలకు ఆహ్వానం అందినట్లు సమాచారం.టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ మిత్తల్, విప్రో సీఈవో శ్రీని పల్లియా, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఎస్.పరేఖ్, బజాజ్ ఫిన్‌సెర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్, మహీంద్రా గ్రూపు సీఈవో అనీశ్ షా, జూబిలెంట్ భర్తియా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు హరి ఎస్.భర్తియాలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.దావోస్‌లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాల నుంచి 3వేలకు పైగా ప్రతినిధులు రానున్నారు. మిత్ర దేశాలు సహా అనేక దేశాలపై సుంకాలు విధిస్తుండటం, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ఘర్షణపూరిత వాతావరణం ఉన్న నేపథ్యంలో ట్రంప్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దావోస్‌లో తెలంగాణ బందం బిజీ
` భారత్ ఫ్యూచర్ సిటీ అభివద్ధికి తోడ్పాటు: యూఏఈ
` ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యానికి ఆసక్తి కనబర్చిన రాయల్ ఫిలిప్స్
` హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చ
` ఇజ్రాయెల్ ఐఎ ఛైర్మన్ అలోన్ స్టోపెల్ తో రేవంత్ భేటీ
` యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యం
` సౌదీ పారిశ్రామిక సంస్థ ‘ఎక్స్ పరెí్టజ’ ఆసక్తి
` తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
` హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుపై యూనిలీవర్ పరిశీలన
హైదరాబాద్,జనవరి20(ఆరఎనఎ): భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్.ఈ. అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక `2026 సదస్సులో భాగంగా దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో యూఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. ’తెలంగాణ రైజింగ’ ప్రతినిధి బందంతో కలిసి రాష్ట్రంలో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ’తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ ను వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ అభివద్ధి అవకాశాలపై సీఎం ప్రత్యేకంగా దష్టి సారించారు. ఇది దేశంలోనే తొలి నెట్`జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. సుమారు 30 వేల ఎకరాల్లో విస్తరించే ఈ నగరంలో ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాస, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికే మారుబేని, సెమ్ కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని, ఇటీవలే రిలయన్స్ గ్రూప్ వంతారాతో ఫ్యూచర్ సిటీలో కొత్త జూ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం కుదిరిందని సీఎం వెల్లడించారు.
ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్య మయ్యేందుకు ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి చూపింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక`2026 వార్షిక సమావేశాల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతత్వంలోని ’తెలంగాణ రైజింగ’ ప్రతినిధి బందం ఫిలిప్స్ గ్లోబల్ నాయకత్వంతో భేటీ అయ్యారు. రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్ స్కీజ్ గ్రాండ్ మాట్లాడుతూ.. ఏఐ రంగంలో తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని చెప్పారు.
ఇజ్రాయెల్ ఐఎ ఛైర్మన్ అలోన్ స్టోపెల్ తో రేవంత్ భేటీ
దావోస్‌లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బందం మొదటి రోజున బిజీ బిజీగా గడిపారు.ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్ తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్ లకు సహకారాలపై విస్తతంగా చర్చించారు. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ ఇన్నోవేషన్‌తో పాటు హెల్త్ టెక్, అగ్రి`టెక్, సైబర్ సెక్యూరిటీ, ఎరో స్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకుంటుంది. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రాయిలీ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనుంది.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యం
సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ’ఎక్స్ పరెí్టజ’ స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చూపింది. సంస్థ ప్రెసిడెంట్ , సీఈఓ మొహమ్మద్ ఆశిఫ్, దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతత్వంలోని ’తెలంగాణ రైజింగ’ ప్రతినిధి బందంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థకు ఉద్యోగ అవకాశాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ శిక్షణ అందించడమే స్కిల్ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశమన్నారు.
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లలో భాగస్వామ్యం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా (ఏపీఏసీ) ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో సమావేశమయ్యారు. ప్రధానంగా వాతావరణంలో పెను మార్పులు, వ్యవసాయంపై దాని ప్రభావం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యల పరిష్కారాలపై సమగ్రంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ ఆర్థిక వద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి నమూనాను వివరించారు. కోర్ హైదరాబాద్ సిటీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరించారు. ట్రాఫిక్ కంట్రోల్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్‌కు మరింత మద్దతు వంటి రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
దావోస్‌లో యూనిలీవర్ ఉన్నతాధికారుల భేటీ
ప్రపంచ వ్యాప్తంగా వస్తు వినియోగరంగంలో అగ్రగామిగా ఉన్న యూనిలీవర్ సంస్థ, హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసే అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక `2026 సదస్సులో భాగంగా మంగళవారం దావోస్‌లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతత్వంలోని ’తెలంగాణ రైజింగ’ ప్రతినిధి బందం యూనిలీవర్ చీఫ్ సపెí్ల చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విª`లలెమ్ ఉయిజెన్తో సమావేశమైంది. తెలంగాణలో జీసీసీ ఏర్పాటు అంశంపై విస్తతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ వేగంగా మారుతుందని వివరించారు. దీనిపై స్పందించిన విª`లలెమ్ ఉయిజెన్ హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇప్పటికే మెక్‌డొనాల్డ్స్, హైనెకెన్, కాస్టకో వంటి ప్రముఖ ఎఫఎంసీజీ (త్వరగా వినియోగ వస్తువుల) సంస్థల జీసీసీలు విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. తెలంగాణకు యూనిలీవర్ విలువైన భాగస్వామి అని, వేగవంతమైన అనుమతులు, లైసెన్సింగ్ పక్రియలతో తెలంగాణ వ్యాపారాలకు అనుకూల రాష్ట్రంగా నిలుస్తోంది అని మంత్రి పేర్కొన్నారు.సమావేశంలో పాల్గొన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా తెలంగాణ రైజింగ్ బందం, తెలంగాణలోని పారిశ్రామిక పార్కుల్లో త్వరగా వినియోగ వస్తువుల (ఎఫఎంసీజీ) తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని యూనిలీవర్‌ను ఆహ్వానించారు.వాతావరణ పరిరక్షణ, నీటి వినియోగంలో సానుకూలత, ఎª`లాస్టిక్ వినియోగ తగ్గింపు వంటి యూనిలీవర్ లక్ష్యాలను, తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న పునరుత్పాదక శక్తి, నీటి సంరక్షణ, సర్క్యులర్ ఎకానవిÖ కార్యక్రమాలతో అనుసంధానం చేసే అంశాలపై కూడా చర్చలు జరిగాయి.



