స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..

` 39 మంది మతి
` 70 మందికిపైగా తీవ్రగాయాలు
మాడ్రిడ్(జనంసాక్షి):స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఘటనలో సుమారుగా 39 మంది మతి చెందారు. హై స్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పి మరో రైలును హైస్పీడ్ రైలు ఢీకొట్టింది. రైళ్లు ఢీకొన్న ఘటనలో మరో 70 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్పెయిన్‌లోని అండలూసియా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 39 మంది ప్రాణాలు కోల్పోగా, 70 మందికి పైగా గాయపడ్డారు. కార్డోబా ప్రావిన్స్‌లోని ఆడముజ్ పట్టణ సవిÖపంలో మాలాగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు (ఇరియో) అకస్మాత్తుగా పట్టాలు తప్పి, ఎదురుగా వస్తున్న మరో రైలును (రెన్ఫే) బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయని, మతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి సమయం కావడం, బోగీలు ఇనుప చువ్వల్లా మెలికలు తిరిగిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇది ‘అత్యంత విచిత్రమైన ప్రమాదం’ అని రవాణా మంత్రి ఆస్కార్ ప్యూయెంటే పేర్కొన్నారు. క్షతగాత్రులను ప్రాంతీయ అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ప్రజల సహాయంతో ఆరు వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. మాడ్రిడ్, అండలూసియా నగరాల మధ్య హైస్పీడ్ రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.



