ఏపీ జెన్‌కో ఉద్యోగాల కోసం నకిలీలు

ఖమ్మం:  ఏపీ జెన్‌కో ఉద్యోగాల్లో చేరెందుకు భారీగా నకిలీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు దారుల్లో 350 మంది నకిలీ ఐఐటీ సర్టిఫికెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  వీరిపై క్రిమినల్‌ కేసులు నమోదు  చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గత డిసెంబర్‌ 18న నిర్వహించిన పరీక్షకు ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయలేదు. దీనిపై విచారణ చేపట్టాని అభ్యర్థులు కోరుతున్నారు.