ఏరోబిక్స్‌ నిపుణురాలు దినాజ్‌ మరో రికార్డు

హైదరాబాద్‌: నగరానికి చెందిన ఏరోబిక్స్‌ నిపుణురాలు దినాజ్‌ వెర్వత్‌వాలా మరో రికార్డు సాధించారు. ఇప్పటికే 24గంటలు ఏరోబిక్స్‌ చేసి గిన్నిస్‌ రికార్డు సాధించిన దినాజ్‌ ఇవాళ 1800 మంది చిన్నారులతో మూడు నిమిషాల్లో రెండు రికార్డులు సాధించారు. జంప్‌జాక్‌, స్టార్‌ స్క్వాట్స్‌ నృత్యాలతో రికార్డులు నెలకొల్పారు. ఏరోబిక్‌ నృత్యంలో భారత్‌ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే తన లక్ష్యమని దినాజ్‌ అన్నారు. త్వరలో మరో రెండు రికార్డులకు సిద్ధమవుతున్నట్లు ఆమె తెలియజేశారు.