ఐదో రోజు ముగిసిన కౌన్సిలింగ్‌

విజయవాడ:డా.ఎన్టీఆర్‌ ఆరోగ్యవైద్యవిశ్వవిద్యాలయం రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో గత ఐదురోజులుగా జరుగుతున్న మొదటి విడత మెడికల్‌ కౌన్సిలింగ్‌ మంగళవారం 760 ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ అయ్యాయి. ఎంసెట్‌ మార్కుల ఆధారంగా 1001నుంచి 3500 మంది అభ్యర్థులు స్లైడింగ్‌ అయ్యారు. మంగళవారం జరిగిన కౌన్సిలింగ్‌కు హైదరాబాద్‌ జేఎన్‌టీయూ కేంద్రంలో 527 ఏయూలో 201, ఎస్వీయూ కేంద్రంలో 144ఎన్టీఆర్‌ ఆరోగ్యవిశ్‌వవిద్యాలయంలో 198 మంది అభ్యర్థులు హాజరై తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన కౌన్సిలింగ్‌ ప్రక్రియలో ఎంబీబీఎస్‌లో 2596 సీట్లు బీడీఎస్‌లో 454 సీట్లు భర్తీ అయ్యాయి. బుధవారం 3501 ర్యాంకునుంచి 6500ర్యాంకు వరకు కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు.