ఐపీఎల్‌ మ్యాచ్‌లలో ఆడటం అనుమానమే


ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌
సిడ్నీ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ యూఏఈ లెగ్‌కు ఆస్ట్రేలియా ప్లేయర్స్‌ అందుబాటులో ఉండటంపై ఆ టీమ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ స్పందించాడు. బయో బబుల్‌లో సుదీర్ఘ కాలం ఉండలేక వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ టూర్లకు దూరంగా ఉన్న స్టార్‌ ప్లేయర్స్‌ అంతా ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని అతడు చెప్పాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఐపీఎల్లో ఆడటం తమకు కలిసి వస్తుందని ఫించ్‌ అన్నాడు. గతంలో ఈ మిగిలిపోయిన్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లలో ఆడటం అనుమానమే అని అతడు చెప్పాడు. అయితే అప్పటి పరిస్థితులను బట్టి తాను స్పందించానని, ఇప్పుడు బయో బబుల్‌కు దూరంగా ఉండి చాలా కాలమైంది కాబట్టి.. ఐపీఎల్‌లో ఆడేందుకు అభ్యంతరం లేదని ఫించ్‌ అన్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు తమ ప్లేయర్స్‌ ఐపీఎల్‌లో ఆడేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఐపీఎల్‌ బయో బబుల్‌ చాలా కఠినంగా ఉంటుందని, స్వేచ్ఛగా ఉండేందుకు అవకాశం ఉండదని మాత్రం తన సహచర ఆసీస్‌ ప్లేయర్స్‌ను ఫించ్‌ హెచ్చరించాడు.