బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరగాలి

` గతంలో లాగా కాకుండా కేటాయింపులు పెరగాలి
` అన్యాయం జరిగితే బీజేపీ ఎంపీలదే బాధ్యత
` మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్ష ఉందన్నారు. దానిని సరిదిద్ది కేటాయింపులు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్‌లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ విÖడియాతో మాట్లాడారు. ఈ పౌర్ణమి తెలంగాణకు వెలుగులు తెస్తుందా..? , చీకటి ఇస్తుందా..? చూడాలని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిసారీ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమం పట్ల ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకత ఉందన్నారు. రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటి తెలంగాణ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సూచించారు. ఈ విషయంపై కేంద్రానికి, బీజేపీకి చివరిసారిగా గుర్తు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర విద్యాసంస్థల స్థాపనకు మోదీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తెలంగాణకి వస్తే తాము గౌరవంగా కలుస్తున్నామని ప్రస్తావించారు. పక్క రాష్టాల్రకి నిధులు కేటాయిస్తే తాము తప్ప్పు పట్టడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.