జాతరలో తప్పిపోయిన చిన్నారి

 

 

 

 

 

 

తల్లిదండ్రులకు అప్పగించిన దామెర పోలీసులు.

నడికూడ, జనవరి 30 (జనం సాక్షి):హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్మకూర్ సమ్మక్క సారలమ్మ జాతరలో శుక్రవారం రోజున హసన్పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన బండారి కిరణ్ రెండు సంవత్సరాల వయసుగల కుమార్తె రష్మిక జాతర ప్రాంగణంలో తప్పిపోగా దామెర పోలీసులు గుర్తించి పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం పాప తల్లిదండ్రులు దామెర పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.