జనం నుంచి వనంలోకి..


` మేడారంను వీడిన వనదేవతలు
` చిలుకలగుట్టకు సమ్మక, కన్నెపల్లికి సారలమ్మ పయనం
ములుగు బ్యూరో(జనంసాక్షి):మేడారం మహాజాతర నాలుగో రోజు ముగిసింది. శనివారం గద్దెల వద్ద పూజల అనంతరం రాత్రి వనదేతవలు వన ప్రవేశం చేశారు. డప్పు, డోలు వాయిద్యాలతో పూజారులు వనదేవతలను గద్దెల నుంచి కన్నెపల్లి, చిలకలగూడ ప్రాంతాలకు తీసుకెళ్లారు. చిలుకలగుట్టకు సమ్మక్కను, కన్నెపల్లికి సారలమ్మను, పూనుగుండ్లకు (మహబూబాబాద్) పగిడిద్దరాజు తరలించారు. గద్దెల పరిసరాల్లో విద్యుత్ దీపాలు నిలిపివేసి పూజారులు వన ప్రవేశం చేయించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి పులకించారు. చివరిరోజు కావడంతో భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. ఈ నెల 28న వనం వీడి జనంలోకి వచ్చిన వనదేవతలు ఇవాళ మళ్లీ వారివారి స్థానాలకు చేరుకున్నారు. రేపు ఆదివారం కావడంతో మేడారంలో రేపు కూడా రద్దీ కొనసాగనుంది.

మేడారం జాతరలో పోలీసుల పనితీరు భేష్
అధునిక టెక్నాలజీతో సమర్థంగా విధులు
రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడి
ములుగు బ్యూరో(జనంసాక్షి): అదివాసీల సహకారంతో పొలీసులు జాతరలో ఉత్సాహంగా విధులు నిర్వహించారని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. వనదేవతలను దర్శించుకున్న డీజీపీ.. కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించిన సీసీ పుటేజీల్లో జాతరలో భక్తుల రద్దీ, జాతరకు వచ్చే దారుల్లో ఉన్న ట్రాఫిక్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన విÖడియాతో మాట్లాడుతూ.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే జాతరలో పిల్లలు, వద్ధులు తప్పిపోతే అచూకీ తెలుసుకోవడానికి గత జాతరల్లో జాప్యం జరిగేదని, కానీ ఈ జాతరలో కొత్తగా చైల్ట్ ట్రాక్ మేనేజ్‌మెంట్ సిస్టం అనే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టి పిల్లలు, వద్ధుల చేతులకు హ్యాండ్ బ్యాండ్ పెట్టడం ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా తప్పిపోయిన పిల్లలు, వద్ధులను కనుక్కోవడం సులువ గా మారిందన్నారు తద్వారా బాధితులతో పాటు పోలీస్‌శాఖకు సంతప్తిని కల్గించం దన్నారు. పొలీస్‌శాఖలో విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న టైయినీ ఐపీఎస్, డీఎస్పీలు పని నేర్చుకునేందుకు జాతరలో విధులు కేటాయించామన్నారు. 1996లో తాను టైనీ ఐపీఎస్‌గా ఉన్నప్ప్పుడు మేడారం వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ జాతరలో చాలా మార్పులు వచ్చా యన్నారు. జాతరకు వచ్చే అన్ని మార్గాల్లో రోడ్లను వెడల్పు చేసి, ట్రాఫిక్ జామ్ అయితే పక్క నుంచి పోయేందుకు ప్రత్యా మ్నాయ మార్గాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ జామ్‌కు అస్కారం లేకుండా పొయిందన్నారు. డ్రోన్ లను ఏర్పాటు చేయడం ద్వారా జాతరలో ప్రతీ మూలకు జరుగుతున్న కార్యకలాపాల ను పరిశీలిం చేందుకు అనువుగా మారిందన్నారు. డీజీపీ వెంట మల్టీజోన్`1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, వరంగల్, రామగుండం పోలీస్ కమిషనర్లు సన్‌ప్రీత్ సింగ్, అంబర్ కిషోర్ ఝా తదితరులు పాల్గొన్నారు.