చర్లపల్లి వద్ద విషాద ఘటన
తల్లీ ఇద్దరు పిల్లలు ఆత్మహత్య
రైలుకింద పడి బలవన్మరణం
హైదరాబాద్(జనంసాక్షి):నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. రైలుకింద పడి ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. శనివారం తెల్లవారుజామున చర్లపల్లి ` ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఎంఎంటీఎస్ డౌన్‌లైన్‌లో తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టుగా రైల్వే పోలీసులు గుర్తించారు. మతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి, విశాల్ రెడ్డి, చైతన్య రెడ్డిగా తెలుస్తోంది. గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మతుల వద్ద రైల్వే టికెట్లు, విలువైన వస్తువులు లేవని జీఆర్‌పీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? ఆర్థికపరమైన ఇబ్బందులేమైనా ఉన్నాయా? ఇంకా ఇతర కారణాలా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కుటుంబం ఆత్మహత్యతో బోడుప్పల్ హరితహారం కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


