హైదరాబాద్ కోఠిలో కాల్పుల కలకలం
` ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తిపై కాల్పులు
` రెండు రౌండ్లు కాల్పులు జరిపి రూ.6 లక్షలు లాక్కెళ్లిన దుండగులు
హైదరాబాద్(జనంసాక్షి):ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. కోఠి బ్యాంక్ స్టీట్?లో ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఇవాళ (శనివారం) ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు, అతడి నుంచి రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కాల్పుల ఘటనపై డీసీపీ శిల్పవల్లి, ఐజీ శ్రీనివాస్‌లు ఆరా తీశారు.శనివారం ఉదయం ఏడు గంటలకు ఏటీఎంలో డబ్బులను జమ చేసేందుకు రిషద్ అనే వ్యక్తి వచ్చాడు. ఈ క్రమంలోనే అతడిని దుండగులు వెంబడించి కాల్పులకు పాల్పడ్డారు. రిషద్ వద్ద ఉన్న రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఘటనలో బాధితుడు రిషద్ కాలికి బుల్లెట్ గాయమైంది. దీంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి డబ్బును ఎత్తుకెళ్లినట్లుగా వెల్లడించారు. బాధితుడు రిషద్?ను నాంపల్లిలోని వస్త్ర వ్యాపారిగా గుర్తించారు.ఘటనా స్థలంలో లభించిన సీసీటీవీ ఫుటేజీలను సుల్తాన్?బజార్ పోలీసులు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన రెండు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోఠిలోని కాల్పుల ఘటనతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్? టీం ఇప్పటికే ప్రాథమిక వివరాలను సేకరించినట్లుగా వెల్లడించారు.”ఉదయం 6.630 నుంచి ఏడు గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లుగా మాకు సమాచారం అందింది. కాల్పులు జరిగిన వెంటనే అప్రమత్తమయ్యాం. నిందితుల కోసం ఐదు బందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నాం. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ విధంగా జరగడం దురదష్టకరం. నిందితులు తప్పించుకోలేరు”` శిల్పవల్లి, డీసీపీ కాల్పుల వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. దొంగలను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బందాలు గాలిస్తున్నాయి. ఘటన జరిగిన అనంతరం పోలీసులను దారి మళ్లించేందుకు దుండగులు కోఠి నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లినట్లు నటించి తిరిగి బయటకు వచ్చి ఆటో ఎక్కి సికింద్రాబాద్ వెళ్లినట్లుగా తెలిసింది. పోలీసులు ఆ ఆటోడ్రైవర్‌ను విచారించారు. నిందితులు తనకు రూ.60 ఇచ్చారని ఆటో డ్రైవర్? తెలిపాడు. వారి మాటల ఆధారంగా దిల్లీకి చెందిన వారిగా డ్రైవర్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడే ముందు దుండగులు బస్?స్టాప్?లో ఫోన్?లో మాట్లాడారు. ఆ నెట్‌వర్క్ ఆధారంగా గాలింపు వేగవంతం చేశారు.


