ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్

 

 

 

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
జిల్లా యంత్రాంగం మొత్తం పురపాలక ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసునట్లు ఆయన పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి యంత్రాంగానికి సహకరించాలని ఆయన సూచించారు.