ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌ సస్పెండ్‌ తిరస్కరణ

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌ను సస్సెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం తిరస్కరించింది. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది. రాజ్యసభ సభ్యుడి ఫోర్జరీ చేసి డీజీపీ డినేశ్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు ఉమేష్‌కుమార్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.