ఒకరి దానం మరొకరి ప్రాణంఒకరి దానం మరొకరి ప్రాణం
మదర్సాలో రక్తదాన శిబిరంబిచ్కుంద మార్చి 20 (జనంసాక్షి)యువతతో నిండిన ఆరోగ్యకరమైన వాతావరణం కోసం రక్తదానం అవసరం. ప్రతి రక్తపు బొట్టు ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టిస్తుందని బెంగళూరుకు చెందిన హజరత్ మౌలానా జమీల్ అహ్మద్ ఖాస్మి అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక జామియా ఖైరున్నిస లిల్ బనాత్ మదర్సా యొక్క 7వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలియజేశారు. కాసేపు బయాన్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అబ్దుల్ అలీమ్ ఫారూఖీ, ముఖీద్, అబ్రార్ మరియు మత పెద్దలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.