ఒలింపిక్స్‌లో విజయాన్ని కాంక్షిస్తూ క్రీడాకారుల పరుగు

విజయనగరం, జూన్‌ 24: మరో నెలరోజుల్లో జరగనున్న ఒలింపిక్స్‌లో భారత్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం క్రీడాకారులు ఒలింపిక్‌ రన్‌ ప్రారంభించారు. స్థానిక కోట జంక్షన్‌ వద్ద ఈ ఒలింపిక్‌ రన్‌ను ఆర్డీఓ రాజ్‌కుమారి ప్రారంభించారు. ఈ పరుగు మూడు లాంతర్లు, గంట స్తంభం జంక్షన్‌ మీదుగా రాజేశ్‌ స్టేడియం వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌ పాల్గొనే అన్ని క్రీడాంశాలలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడల పట్లమరింత ఆసక్తిని పెంచేందుకు ఇటువంటి పరుగులు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అయ్యలు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 400 మందితో సాగిన ఈ పరుగు అందరినీ ఆకర్శించింది.