పెద్ద ధన్వాడలో అరెస్టులను ఖండించిన శాంతి చర్చల కమిటీ

హైదరాబాద్ (జనంసాక్షి) : ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటానికి శాంతి చర్చల కమిటీ సంఘీభావం తెలిపింది. ప్రజాసంఘాల నేతల అరెస్టులను ఖండించింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ నగరంలో జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన శాంతి చర్చల కమిటీలో తీర్మానించారు. శాంతియుతంగా ప్రజలు పోరాటం చేస్తుంటే పోలీసులు నిర్బంధం కొనసాగించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇథనాల్ వ్యతిరేకంగా కొనసాగబోయే ఉద్యమాలకు శాంతి చర్చల కమిటీ మద్దతుగా ఉంటుందని, ప్రజలతో కలిసి ఉద్యమంలో ముందుకెళ్తుందని ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ప్రకటించారు.