ఓఎంసీ కేసులో ఆలీఖాన్‌కు జ్యుడిషియల్‌ కస్టడీ

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసులో ఆలీఖాన్‌కు సీభీఐ కోర్టు ఈనెల 17వరకు జ్వుడీషియల్‌ కస్టడీ విధించింది ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో సహ నిందితుడు గాలి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ను నాంపల్లిలోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు శుక్రవారం హాజరు పరిచారు అసోసియేట్‌ మైనింగ్‌ కంపెనీ గనుల తవ్వకాల కేసులో  బెవగుళూరు సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఆయనను ట్రాన్సిట్‌ వారెంటు పై హైదరాబాకు నిన్న రాత్రి తరలించారు ఓఎంసీ కెసులో గాలితో పాటు సహ నిందితుడుగా ఉన్న ఆయన గత ఏడాది గాలి అరెస్టు సమయంలో పరారై నాలుగు నెలల క్రితం బెంగుళూరు సీబీఐ కోర్టులో లొంగిపోయారు సీబీఐ సోదాల్లో స్వాధీనం చేసుకున్న ల్వావ్‌టావ్‌లోని సమాచారాన్ని రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది ప్రస్తుతం దాన్ని అలీఖాన్‌ చేత తెరిపించి అక్రమ తవ్వకాల వివరాలను తెలుసుకోనుంది. ఇందుకు అలీఖాన్‌ కస్టడీ కోసం సీబీఐ పిటీషన్‌ దాఖలు చేయనుంది