ఓఎంసీ కేసులో స్వాధీనం చేసుకున్న కార్లను తిరిగి ఇచ్చేయవచ్చు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో సీబీఐ స్వాధీనం చేసుకున్న వాహనల్లో ఐదు కార్లను తిరిగి ఇచ్చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థను సీబీఐ కోర్టు ఆదేశించింది. 74 లక్షల రూపాయల విలువైన ఆస్తిని పూచీకత్తుగా సమర్పించాలని ఆదేశించింది. గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు ఓఎంసీ, శ్రీ మినరల్స్‌ సంస్థలకు చెందిన ఏడు కార్లు, ఓ హెలికాప్టర్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అయితే కేసు విచారణ పూర్తయ్యే లోగా వహనాలు చెడిపోయే ప్రమాదమున్నదున తమకు తిరిగి ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. హెలికాప్టర్‌, రోల్స్‌రాయిస్‌ కారు విలువ నివేదికలు ఇంకా అందనందున విచారణను ఈ నెల 31కి వాయిదావేసింది.