ఓయూలో శాంతి ప్రదర్శన

హైదరాబాద్‌ : మానవత్వాన్ని రక్షించుకుందాం సమానత్వాన్ని పెంపొందించుకుందాం. అనే నినాదంతో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అఖిలభారత మానవహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్‌ తరపున ఆల్‌ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించారు.