ఓయూ విద్యార్థులపై కేసుల ఎత్తివేత

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఓయూ విద్యార్థులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 15 వేర్వేరు కేసుల్లో 984 మంది విద్యార్థులపై ఉన్న కేసులను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.