కంకోల్ లో రూ. 30 లక్షలతో నూతన పాఠశాల భవనానికి భూమి పూజ

 

 

 

 

 

 

ఫోటో రైటప్: పాఠశాల భవనానికి భూమిపూజ చేస్తున్న ఎంపీపీ

– రూ.30 లక్షల నిధులతో నూతన పాఠశాల భవనానికి భూమిపూజ
-సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ
-ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సహకారంతో మండలంలోని పాఠశాల అభివృద్ధి

మునిపల్లి (జనంసాక్షి): మండలంలోని కంకోల్ గ్రామంలో మన ఊరు మన బడి పథకం కింద రు. 30 లక్షల నిధులతో సోమవారం నాడు నూతన పాఠశాల భవనానికి ఎంపీపీ శైలజ శివశంకర్, సర్పంచ్ విశ్వనాథంతో కలిసి భూమి పూజ చేసారు. ఎంపీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల తీరు మారుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అధునాతన వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సహకారంతో మండలంలోని పాఠశాలలను అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు ఎంపీపీ. ఈ కార్యక్రమంలో పీఆర్ ఏఈ మధుకర్, మండల విద్యాధికారి దశరథ్, మాజీ జడ్పీటీసీ శ్రీశైలం స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయసుధ, సంతోషమ్మ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శివశంకర్ తో పాటు పాఠశాల సిబ్బంది, ఇతర నాయకులు పాల్గొన్నారు.