కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం

 చేసుకోవాలి.కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.మునిసిపల్ చైర్పర్సన్ కల్పన భాస్కర్ గౌడ్.17వ వార్డులో కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మునిసిపల్ చైర్పర్సన్.
నాగర్ కర్నూల్ జిల్లా జనంసాక్షి:కంటివెలుగు కార్యక్రమాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మునిసిపల్ చైర్పర్సన్ కల్పన భాస్కర్ గౌడ్ అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ మునిసిపల్ పరిధిలోని 17వ వార్డులో కంటివెలుగు శిబిరాన్ని మునిసిపల్ ఇంచార్జి కమీషనర్ యాదయ్యతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కంటివెలుగు కార్యక్రమంలో కంటి సమస్యలు ఉన్న వారు కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి కమీషనర్ యాదయ్యతో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.