కంతనపల్లికి ఈ నెల 20న టెండర్లు
హైదరాబాద్ : కంతనపల్లి ప్రాజెక్టుకు ఈ నెల 20న టెండర్లు పిలవనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శ్రీరాంసార్ ప్రాజెక్టు రెండో ఫేజ్ వల్ల వరంగల్ జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని వెల్లడించారు.బాబ్లీ ప్రాజెక్టుపై త్వరలోనే అన్ని పక్షాలతో చర్చించి ఏం చేస్తే బాగుంటుదనేది నిర్ణయిస్తామని వివరించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, కల్వకుర్తి, నెట్టంపాడు కాల్వలకు కూడా అదనపు నిధులు ఖర్చు చేస్తామని వెల్లడించారు.