కరువు ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరిన కేంద్ర మంత్రులు

ఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్‌లు కరువు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటనకు గాను ఈరోజు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ముంబాయిలో ముఖ్యమంత్రి పృధ్వీరాజ్‌ చవాన్‌తో భేటీ కానున్న వీరు మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తమ రాష్ట్రాల పర్యటన అనంతరం వ్యవసాయంపై మంత్రుల సాధికార బృందం సమావేశమై తదుపరి చర్యలపై చర్చిస్తుందని శరద్‌పవార్‌ తెలిపారు.